ఆంధ్రప్రదేశ్‌

20మంది ఎంపీలతో ఏం సాధించారో చెప్పండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 22: వచ్చే ఎన్నికల్లో 25మంది ఎంపీలను టీడీపీ నుంచి గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఇప్పుడున్న 20 మంది ఎంపీలతో ఏం సాధించారో ఆయన చెప్పాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఆదివారం గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మీకు ప్రజలు గెలిపించిన ఎంపీలతో పాటు ముగ్గురు వైకాపా ఎంపీలను కలుపుకొని 20మంది ఉన్నా ఏమీ సాధించలేక పోయారన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను తుంగలో తొక్కిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వారిని ఎంపీలుగా గెలిపిస్తే హోదా సాధిస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ చేసుకున్న చీకటి ఒప్పందం టీటీడీ బోర్డులో మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సతీమణికి చోటుకల్పించడంతో బట్టబయలైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రిగోల్డ్ విషయంలో నాటకాలాడుతున్నారని, 25లక్షల మంది బాధితుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్థులను స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి ఎవరిని కలిశారో అర్థమైందన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల విధానాల కారణంగా నాలుగేళ్లుగా రాష్ట్రం అతలాకుతలమై 25 సంవత్సరాలు వెనక్కెళ్లిందని దుయ్యబట్టారు. వీరి కలయికతో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైందని, ప్రజలకు అందించాల్సిన మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కూడా అందించలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతి సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ లబ్ధిపొందాలని చూస్తోందని, ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా పోరును తనవైపునకు తిప్పుకోవాల్సిన చూస్తోందన్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పుట్టగతులుండవని బొత్స హెచ్చరించారు.