ఆంధ్రప్రదేశ్‌

23 నుంచి మన ఊరు - మన బడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమానికి సన్నద్ధమైంది. ఈ నెల 23 నుంచి 30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. దీంతో సెలవులకు ఒకరోజు ముందు నుంచే ఉపాధ్యాయులను బడిబాటలో భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19 విద్యా సంవత్సరంలో భాగంగా మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) నిబంధనలో భాగంగా దీన్ని నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను నివారించేందుకు మనబడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డ్రాపవుట్స్‌ను నివారించడం, కొత్తగా పాఠశాలల్లోకి పిల్లల్ని చేర్పించడం, ఆర్‌టీఈ నిబంధనల్లో భాగంగా ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థుల నిష్పత్తి ఉండేలా చూడటం, బడిఈడు వచ్చి బడికి రాని పిల్లలను గుర్తించడం, వారి వివరాలను సేకరించి తల్లిదండ్రులను సంప్రదించి బడిలో చేర్పించడం, కొంతకాలం బడికి వచ్చి మధ్యలో మానేసిన వారిని గుర్తించి తిరిగి వారిని బడిబాట పట్టేలా చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ఆయా జిల్లాల డీఈవోల పర్యవేక్షణలో పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులతో కలిసి ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొనాలి. 23న ఎంపీ, ఎమ్మెల్యేలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బడిబాటను ఈ నెల 23న జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, విద్యార్థుల చేర్పింపునకు కృషి చేస్తారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యాన ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు పాల్గొంటారు. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లలో విద్యార్థుల పెంపునకు చర్యలు చేపడతారు. మనబడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఉచిత విద్య, పుస్తకాలు, దుస్తుల పంపిణీపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా, అర్హులైన ఉపాధ్యాయులతో బోధనా విధానంపై అవగాహన కల్పిస్తారు.
24 నుంచి 26 వరకూ సర్వే
బడిబాటలో భాగంగా గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ అవగాహన కార్యక్రమాల్ని చేపడతారు. 24న అంగన్‌వాడీల ఆధ్వర్యాన బడిబాటపై ప్రచారం కల్పిస్తారు. 25న ఐదో తరగతి పూర్తిచేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతారు. 26న 7, 8 తరగతులు పూర్తిచేసుకున్న విద్యార్థులను గుర్తించి 8, 9 తరగతుల్లో చేర్పిస్తారు.