ఆంధ్రప్రదేశ్‌

గందరగోళం.. సీఎఫ్‌ఎంఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: ఈనెల 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించిన సీఎఫ్‌ఎంఎస్ విధానం మొత్తంపై గందరగోళంగా తయారైంది. ఏప్రిల్ 1వ తేదీ తరువాత రిటైరైన వారికి ఈరోజు పెన్షన్ అందలేదు. దానికి కారణం గతంలో వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారికున్న ఐడీ నెంబర్, ఇతర వివరాలు సిస్టమ్‌లో డిలీట్ కాకపోవటం, కొత్తగా ఐడీ నెంబరు క్రియేట్ కాకపోవటం వలన పెన్షన్ పేమెంట్ చేయటానికి వీలు లేకుండా ఉంది. ఇలాంటివారిలో పెద్ద స్థాయిలో రిటైరైన వారు కూడా ఉన్నారు. ఈనెల జీతాలు బిల్లులు 25వ తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు. కానీ పోయిన నెలలో పాద పద్ధతిలోనే చేశారు. ఈనెల మాత్రం ట్రెజరీ అధికారులు హెచ్‌ఆర్‌ఎంఎస్ ప్యాకేజీలోకి పోయి సీఎఫ్‌ఎంఎస్ విధానంలోనే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ట్రెజరీ సిస్టమ్స్‌లో సీఎఫ్‌ఎంఎస్ విధానంలోకి మార్చటానికి అనేక అవరోధాలు ఏర్పడటంతో వచ్చేనెల జీతాలు వస్తాయా రావా అనే విషయమై అనుమానాలు నెలకొన్నాయి. నెల రోజులు పనిచేసిన వారికి 1వ తేదీన జీతం ఇవ్వాలని ఉంది. ఇదేకాక పోయిన నెలలో పింఛన్లు పంపిణీ చేసినా చాలా మందికి అనేక అవరోధాల వల్ల రీబ్యాక్ అవటం జరిగింది.