ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం వివక్షపై నేడు బ్లాక్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజలు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు అరగంట సేపు లైట్లు తీసివేసి బ్లాక్‌డేగా పాటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ కోసం చేసిన చట్టాలు, ఇచ్చిన హామీలు అమలుకై గత నాలుగేళ్లుగా నిరసనలు వెల్లువెత్తుతుంటే మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో రామకృష్ణ పేర్కొన్నారు. మోదీ ఓ నియంతగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని, ఒక్క బీజేపీ మినహా అన్ని పక్షాలు ప్రత్యేక హోదా నినాదంతో ముందుకు సాగుతున్నా మోదీకి మాత్రం చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా ఉందన్నారు. ఇప్పటికైనా మోదీ దిగిరాకపోతే రాబోయే రోజుల్లో మోదీ ప్రభ మరింత మసకబారి బీజేపీ చీకట్లో కలసిపోక తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో వౌలిక ప్రజా సమస్యల పరిష్కారంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమవుతున్నారని రామకృష్ణ అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, పక్కా గృహాలు నిర్మించాలని, రేషన్ కార్డులు, పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ రూ.3వేలు పెన్షన్ ఇవ్వాలని, ఉచితంగా విద్య, వైద్యం అందించాలని, ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్స్‌లను బేషరతుగా అమలుచేయాలని డిమాండ్ చేశారు.