ఆంధ్రప్రదేశ్‌

ప.గో.లో టీడీపీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం: పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు సహా స్థానిక సంస్థలన్నింటిలో సంపూర్ణ మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసాపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయితో పాటు 16 మంది టీడీపీ కౌన్సిలర్లు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. కౌన్సిల్‌లోని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానంతో ప్రభుత్వానికి సరెండర్ చేసిన మున్సిపల్ డీఈ శ్రీకాంత్‌ను తిరిగి ఇక్కడే కొనసాగేలా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంపై మనస్తాపం చెందిన తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేసినట్టు ఛైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయి సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు పంపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డీఈ శ్రీకాంత్ చేష్టలను వివరిస్తూ ఛైర్‌పర్సన్ రత్నమాల సాయి కంటతడి పెట్టుకున్నారు. డీఈ నిర్లక్ష్య పద్ధతిని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు వివరించినా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. దీనిపై విసిగిపోయిన కౌన్సిల్ మార్చి నెలలో జరిగిన సమావేశంలసో డీఈని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేసిందన్నారు. అయితే ప్రభుత్వం డీఈని ఇక్కడే కొనసాగించడం న్యాయం కాదని చైర్‌పర్సన్ రత్నమాల సాయి వాపోయారు. సమావేశంలో రాజీనామా చేసిన కౌన్సిలర్లు సందక సురేష్, తిరుమాని శశిదేవి, బళ్ళ వెంకటేశ్వరరావు, భారత లక్ష్మణ, జక్కం సుధారాణి, గౌరు సత్తిబాబు, పెదశింగు మణి, అబేదసుల్తాన, వనె్నంరెడ్డి శ్రీనివాసు, ఆరేటి వేణు, బూసరపు రాఘవమ్మ, తుమ్మలపల్లి వెంకటరమణ, అధికారి అనంత రామారావు, కో-ఆప్షన్ సభ్యులు కోటిపల్లి ఆనందరావు పాల్గొన్నారు.

చిత్రం..కంటతడి పెడుతున్న ఛైర్‌పర్సన్