ఆంధ్రప్రదేశ్‌

మోదీ హామీలు గుర్తొచ్చేలా తిరుపతి సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: ఎన్నికలకు ముందు తిరుపతి సభలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ప్రజలకు గుర్తొచ్చేలా తిరుపతి బహిరంగ సభను నిర్వహించాలని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుపతి సభకు పోటీగానే విశాఖలో వైకాపా సభ నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానం భర్తీలో గాలి కుటుంబానికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతి బహిరంగ సభ, చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు తదితర అంశాలపై ఉండవల్లిలోని తన నివాసంలో చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సీఎం మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. విభజన హామీల అమల్లో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే టీడీపీ వివిధ రకాల ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించింది. సభ నిర్వహణపై నేతలతో సీఎం చర్చించి దిశా నిర్దేశం చేశారు. తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తుకు వచ్చేలా సభ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. పార్టీ ముఖ్యులు, మంత్రులు అందరూ తిరుపతి సభకు హాజరు కావాలని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో జరిగిన భేటీలో ఈ నెల 30న వైకాపా విశాఖలో నిర్వహించనున్న సభ అంశం కూడా చర్చకు వచ్చింది. తిరుపతి సభకు పోటీగానే విశాఖలో సభ నిర్వహిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. అదే రోజున జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా సభ నిర్వహించే వీలు లేకపోలేదని కొంతమంది నేతలు సీఎం వద్ద ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ, జగన్, పవన్‌లు ఇద్దరూ ఒకే దారిలో వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధానిని వదిలేసి, టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని సీఎం తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానిపై విమర్శల జోరు తగ్గించాలని గవర్నర్ చెప్పడం సరికాదని కొంతమంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయడు మృతి కారణంగా ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఖరారుపై కూడా చర్చించారు. అంతకుముందుకు సీఎంను గాలి కుమారులు భాను, జగదీష్ కలిశారు. గాలి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని గాలి కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ వ్యవహారంపై గాలి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని మంత్రి అమరనాథ్ రెడ్డి, టీడీపీ నేతలు వర్ల రామయ్య, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నానికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై గాలి కుటుంబ సభ్యులతో వీరు ముగ్గురు బుధవారం సమావేశం కానున్నారు.