ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్రపై కూడా జీఎస్‌టీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: 2022 వరకు హజ్ సబ్సిడీ కొనసాగిస్తూ అంచెలంచెలుగా సబ్సిడీ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పట్టించుకోకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 2018లోనే హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ మండిపడింది. అదే విధంగా హజ్ యాత్రికులకు ఆర్థిక వెసులుబాటు కల్పించి ఆదుకోవాల్సిన సమయంలో 18 శాతం జీఎస్టీ విధించి 10వేల రూపాయలకు పైగా అదనపు భారం వేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
హజ్ కమిటీ 12వ సమావేశం విజయవాడలో మంగళవారం జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మహ్మద్ అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 2018 హజ్ యాత్రపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రికులపై 18 శాతం జీఎస్టీ విధించడాన్ని హజ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. హజ్ యాత్రికులు మక్కా వెళ్లడానికి విజయవాడ విమానాశ్రయానికి ఎంబార్కేషన్ హోదా ఇచ్చే విషయంలో కూడా నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొంది. అందుకే ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హజ్ యాత్రికులు హైదరాబాద్ నుంచే వెళ్లవలసి వస్తుందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఇచ్చిన ఆదేశాల మేరకు హజ్ యాత్రకు వెళ్లే మొదటి గ్రూప్‌ను విజయవాడ పిడబ్ల్యుడీ గ్రౌండ్ నుంచి వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మహ్మద్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. మన రాష్ట్ర హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. కడపలో రూ.12కోట్లతో ఇప్పటికే హజ్ హౌస్ నిర్మాణం జరుగుతోందన్నారు. విజయవాడలో కూడా హజ్ హౌస్ నిర్మించడానికి స్థల సేకరణ దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. త్వరలోనే శంకుస్థాపన చేడపతామని ఆయన తెలిపారు. రూ.24 కోట్ల రూపాయలతో సకల సదుపాయాలతో అత్యంత అధునాతన హజ్ హౌస్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో హజ్ కమిటీ సభ్యులు, ముఫ్తీ మహ్మద్ ఫారూఖ్, వౌలానా ఇలియాస్, మహ్మద్ రఫీ, షేక్ మస్తాన్ షరీఫ్, హాజీ షేక్ హసన్ బాషా, షేక్ అక్బర్ సాహెబ్, అబ్దుల్ చిన రెహ్మాన్, సయ్యద్ మఖ్దూమ్ బుఖారి, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ అలీలు పాల్గొన్నారు.