ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వని కేంద్రంపై నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 24: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, జడ్పీటీసీ సభ్యులు మంగళవారం ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసార ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జబల్‌పూర్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగం లైవ్ టెలికాస్ట్‌ను మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ ప్రసంగం తాము వినాలా? హోదా ఇవ్వని కేంద్రం ప్రచారం ఆపేయండి.. అంటూ మంత్రి పరిటాల సునీత, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, పలువురు జడ్పీటీసీ సభ్యులు ఎల్‌ఈడీ స్క్రీన్ ముందుకు వెళ్లి అడ్డంగా నిలుచున్నారు. మోదీ ప్రసంగాన్ని తాము వినదలచుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సునీత స్వయంగా ప్రొజెక్టర్ బటన్ నొక్కి ఆపివేశారు. ఈ సందర్భంగా ‘ప్రధాని డౌన్ డౌన్.. ఏపీకి న్యాయం చేయాలి.. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి.. విభజన హామీలు నెరవేర్చాలి.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రత్యక్ష ప్రసంగం నిలిచిపోవడంతో మంత్రితో పాటు సభ్యులు శాంతించారు.

చిత్రం..అనంతపురం జడ్పీలో ప్రధాని ప్రత్యక్ష ప్రసంగాన్ని
అడ్డుకుంటున్న మంత్రి సునీత, జడ్పీ చైర్మన్, సభ్యులు