ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థలు మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రం కూడా బలంగా ఉంటుందని, అధికారాల్లో కేంద్రం, రాష్ట్రం ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలను బలోపేతం చేశారని, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎపుడూ జరగని అభివృద్ధి జరిగిందంటే అది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని ద్వారపూడి గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవ సభలో ఎంపికైన వంద గ్రామాల సర్పంచులకు ఆయన అవార్డులు ప్రదానంచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఎన్టీఆర్ హయాం నుంచి పోరాటం జరిగిందన్నారు. సర్కారియా కమిషన్ అందుకే వేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో విద్యుత్‌కు కొరతలేకుండా చేశామన్నారు. దేశంలోనే వినూత్నంగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఎల్‌ఈడీ వెలుగులను తీసుకొచ్చామన్నారు. అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో 27 లక్షల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేసి దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలవనుందన్నారు. నూరు శాతం ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు సాధించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి అభినందించారు. రూ.4500 కోట్ల వ్యయంతో మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడటానికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అని, ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తే రాష్ట్రానికి నీటి భద్రత లభిస్తుందని, ప్రతీ ఎకరానూ సాగులోకి తీసుకురావచ్చన్నారు. రాష్ట్రంలో మట్టి పరీక్షల ద్వారా ఎరువుల వాడకం తగ్గించామన్నారు. కాంగ్రెస్ నేతల నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఫోక్స్ వేగన్ కార్ల కంపెనీ పోయిందని, తనపైవున్న నమ్మకంతో శ్రీసిటీలో హీరో మోటార్స్, అంతపురంలో కియా కార్ల కంపెనీ వచ్చిందన్నారు. బహిరంగ సభకు ముందు ద్వారపూడి ఆర్వోబీకి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. రాష్టవ్య్రాప్తంగా 15వేల కిలో మీటర్ల సీసీ రోడ్లు నిర్మించినందుకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరించారు. పంచాయతీలు, గ్రామాలు, గ్రామాల అభివృద్ధి, వాటర్ షెడ్ విజయగాథలు అనే మూడు పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గ్రామ వికాస్ సీడీని ఆవిష్కరించారు.
చిత్రం..పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా సర్పంచులకు అవార్డులు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు