ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ సైకిల్ యాత్రలపై చంద్రబాబు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్రలపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఏఏ నియోజకవర్గాల్లో యాత్రలు ప్రారంభం కాలేదో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా 166 నియోజకవర్గాల్లో విజయవంతంగా సైకిల్ యాత్రలు జరిగాయని, 9 నియోజకవర్గాల్లో ఇంకా సైకిల్ యాత్రలు ప్రారంభం కాలేదని, 2,115 గ్రామాల్లో సైకిల్ యాత్రలు విజయవంతంగా జరిగాయని, 1,630 గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు చేశారని, 1774 మినీ మీటింగ్స్ నిర్వహించామని, 10,960 సైకిళ్లతో ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు పర్యటించారని పార్టీ బాధ్యులు సీఎంకు తెలిపారు. గత నాలుగు రోజుల్లో 410 గ్రామాలలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారని వివరించారు. ప్రతిరోజూ 100 గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు పర్యటించడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘సైకిల్ యాత్రల నిర్వహణ తీరుపై నివేదికలు ఇవ్వాలి. ఏ, బీ, సీ కేటగిరీలుగా యాత్రల తీరుపై విశే్లషణ జరపండి. ఎన్ని నియోజకవర్గాల్లో యాత్రలు ప్రారంభం కాలేదో, ఎన్నింటిలో బాగా జరిగాయో, ఎన్నిచోట్ల పాక్షికంగా జరిగాయో రోజువారీ నివేదికలు పంపాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, పార్టీలో ప్రతిఒక్కరూ సానుకూల దృక్పథం అలవర్చుకోవాలన్నారు. రాష్టస్థ్రాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీలో సానుకూల వాతావరణం ఉండాలని, పార్టీలో పైనుంచి కింది వరకు ప్రతిఒక్కరూ సానుకూలంగానే మాట్లాడాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, మాల్యాద్రి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.