ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ - మెప్మా మధ్య క్యాన్సర్ చికిత్సకు ఎంవోయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈమేరకు మెప్మా ఎండీ చినతాతయ్య సంబంధిత సంస్థలతో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇందులో ఒకటి మహిళల ఆరోగ్యానికి, రెండోది మహిళల ఆర్థిక స్వావలంబనకు సంబంధించినవి. మహిళల్లో అత్యధికంగా వచ్చే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే 20లక్షల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై అవగాహన కల్పించడం, అవసరమైన పరీక్షలు ఉచితంగా నిర్వహించడం, వ్యాధి నిర్థారణ అయితే తగిన చికిత్స అందించడం ఈ ఒప్పందం లక్ష్యాలు. మరోవైపు కుటుంబ వికాసం - సమా జ వికాసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రతి కు టుంబానికి నెలకు 10వేల రూపాయ ల ఆదాయం సముపార్జించేలా చేయడానికి మెప్మా ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు నెలకు రూ. 10వేలు సంపాదించేలా సాంఘి క, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే గురుకులాల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే ఒప్పందం కూడా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది. దీని ప్రకారం 2018-19 సంవత్సరానికి గాను 189 సాంఘిక సంక్షే మ పాఠశాలల్లోని 1,08,000 మంది విద్యార్థులకు, 104 గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని 39,450 విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిద్వారా 3లక్షల మహిళల కుటుంబాలు నెలకు రూ. 10వేల వరకు ఆదాయాన్ని సముపార్జించే వీలు కలగనుంది. దేశంలోనే కొత్తగా, వినూత్నంగా మన రాష్ట్రంలో ఈ పథకాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆదాయం అనే నాలుగు అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే పేదరికం సంపూర్ణంగా తొలగించినట్టని ముఖ్యమంత్రి తరచూ చెప్తుంటారని, ఆ దిశగా ఇవాళ మంచి కార్యక్రమం చేపట్టామని ఆయనన్నారు. దేశంలో ప్రతి ఏడాది సగటున 18లక్షల మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇందు లో రొమ్ము, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ల బాధితులే అధికమని, ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్‌తో మరణిస్తోందని ఆయన చెప్పారు. క్యాన్సర్‌కు గురైన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి రొమ్ము క్యా న్సర్ ఉంటున్నట్టు, రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరు మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇంత తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి ఈరో జు జరిగిన ఒప్పందం గొప్ప మలుపని మంత్రి నారాయణ వివరించారు.
చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ, మెప్మా అధికారులు