ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి కన్నాకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన మధ్యాహ్నం 2గంటలకు తన అనుచరులు, సన్నిహితులు, వేలాది మంది కార్యకర్తలతో కృష్ణా జిల్లా ఉంగుటూరు వద్ద ప్రతిపక్ష, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలుసుకుని పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టి రక్తపోటు అధికం కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు సైతం ఎవ్వరినీ అనుమతించడం లేదు. రెండురోజులు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన వైసీపీలో చేరాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉంగుటూరు తరలివెళ్లేందుకు కన్నా నివాసానికి చేరుకున్న కార్యకర్తలు ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. కోలుకున్న తర్వాత జగన్ సమక్షంలో పార్టీలో చేరే అంశంపై వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరే విషయమై కార్యకర్తలు, నాయకులతో ఎడతెగని మంతనాలు, సమావేశాలు నిర్వహించడంతో ఆయన నీరసించినట్లు తెలిసింది. బీజేపీ నేతల బుజ్జగింపులు, వైసీపీ ఆహ్వానాలతో ఒకింత మానసిక ఒత్తిడికి గురైనట్లు చెపుతున్నారు.