ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తాం: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: పాఠశాల విద్యా శాఖ నుండి ఉపాధ్యాయుల పోస్టుల మంజూరు కోసం పంపిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి డీఎస్సీ- 2018లో చేర్చాలని యుటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పీ బాబురెడ్డి, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వీ బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును కలిసి విజ్ఞప్తి చేశారు. రూ. 398 స్పెషల్ టీచర్స్ సర్వీస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, డీఎస్సీ 2008 ద్వారా ఎంపికై హామీ పత్రాల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు కోర్టు ఉత్తర్వుల మేరకు 2008 డీఎస్సీ ఉపాధ్యాయులతో సమానంగా నోషనల్ పే ఫిక్సేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి రామకృష్ణుడు స్పందిస్తూ సదరు ఉపాధ్యాయ పోస్టులను కేబినెట్ ఆమోదం తీసుకుని మంజూరు చేస్తామన్నారు. డీఎస్సీ హామీ పత్రాల ఉపాధ్యాయుల వేతన సవరణ చేస్తామని, రూ. 398 స్పెషల్ టీచర్స్ సర్వీస్, నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని వివరించారు.