ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో భూగర్భ జలసిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు వేయిస్తే నీరుపడక, వర్షాలు కురవక, పంట పొలాలు ఎండిపోయి పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూగర్భ జలాల గురించి గతంలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. దాంతో సాగునీరుతో పాటు మంచినీరు కూడా కరువైంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కరువు తాండవించింది. దాంతో అటువంటి ప్రాంతాల్లో వర్షాలు కురిస్తేనే అంతంత మాత్రంగా పంటలు పండేవి. వర్షం పడకపోతే పంటలు ఎండిపోయేవి. రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. కొందరు రైతులు అప్పులు చేసి తమ పొలాల్లో బోర్లు వేయిస్తే నీరు పడేది కాదు. వందల అడుగుల లోతున బోర్లు వేయించినా ఫలితం ఉండేది కాదు. దాంతో పంటలు ఎండిపోయి, అప్పులు తీర్చలేక అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. భూగర్భ జలాలను పెంచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా రైతుల్లో, ప్రజల్లో భూగర్భ జలాలపై అవగాహన పెంచింది. భూమీదపడే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుకుని భూమిలో ఇంకిపోయే విధంగా చేసి భూగర్భ జలాలను పెంచడంలో విజయం సాధించింది. నీటి వనరుల విస్తృత ప్రయోజనాలను గుర్తించిన ప్రభుత్వం ‘నీరు-ప్రగతి’ పంట సంజీవని వంటి కార్యక్రమాలు చేపట్టింది. 2015-16లో ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.2466 కోట్లు ఖర్చు చేసింది. కృష్ణా, గోదావరి నదులను విజయవంతంగా అనుసంధానం చేసి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతానికి నీరందించింది. చెరువులు పూడిక తీయడం ద్వారా 6.61 టిఎంసిల నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరిగింది. 68,095 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరింది. పూడిక తీసిన మట్టిని రైతులు తమ పల్లపు పొలాలను మెరక చేసేందుకు ఉపయోగించుకున్నారు. పెద్దఎత్తున ఇంకుడు గుంతలు తీసే కార్యక్రమం చేపట్టడం ద్వారా అదనంగా 7.70 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పంట సంజీవని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో 1,14,882 నీటి గుంటలు తవ్వారు. తద్వారా అదనంగా వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరింది. నీటి నిల్వల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో ఈ కార్యక్రమాల ప్రభావం బాగా కనిపించింది. రాష్ట్రంలో 37 శాతం ప్రాంతంలో 3 నుంచి 8 మీటర్ల మధ్యలో భూగర్భ జలాలు ఉన్నాయి. 8 శాతం ప్రాంతంలో 3 మీటర్లకు పైనే భూగర్భ జలాలు ఉన్నాయి. 55 శాతం ప్రాంతంలో 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. కరవు ప్రాంతమైన రాయలసీమలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే రాయలసీమలో భూగర్భ జలాలు 5.71 మీటర్ల వరకు పెరిగాయి. గత ఏడాది మే నెలలో 21.95 మీటర్లు వుండగా, ఈ ఏడాది మే 15 నాటికి 16.24 మీటర్ల వరకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 0.99 మీటర్లు పెరిగాయి. గత ఏడాది మేలో 13.83 మీటర్లు ఉండగా, ఈ ఏడాది మే 15నాటికి 12.84 మీటర్లలో జలాలు ఉన్నాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం 1.09 మీటర్ల వరకు భూగర్భ జలాలు తగ్గాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 16.66 మీటర్లు భూగర్భ జలాలు పెరిగి చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో 8.42 మీటర్లు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2.93 మీటర్లు, అనంతపురం జిల్లలో 2.35 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. 2015 జూన్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు రాష్ట్రం మొత్తం మీద భూగర్భంలో అదనంగా వంద టిఎంసిల నీరు నిల్వ అయింది. నీటి నిల్వలు పెంచడంలో ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.
గత ఏడాది ఫలితాలతో ఈ ఏడాది ప్రభుత్వం ‘నీరు-ప్రగతి’కి 5,568 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో 6.05 లక్షల నీటి గుంటలు తవ్వించాలని లక్ష్యంగా నిర్ణయించింది. అలాగే 33వేల 305 చెరువుల మరమ్మతులు చేయించాలని, 12వేల 612 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని, భూగర్భ జలాలు రీఛార్జి అయ్యే నిర్మాణాలు 41వేల వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇంకా చెరువుల్లో పూడికతీత, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా అదనంగా 25 టిఎంసిల వరకు నీటి నిల్వలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాలు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు భారీస్థాయిలో పెరిగి రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు.