ఆంధ్రప్రదేశ్‌

కొల్లేరు అభయారణ్యంలో ప్రత్యేక సందర్శనా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 16: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని అటవీ సర్కిల్‌లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పాపికొండలు, కోరంగి అభయారణ్యం, కొల్లేరు ప్రాంతాల్లో ప్రత్యేక సందర్శనా ప్రాంతాలను ఏర్పాటుచేశారు. పర్యాటక ప్రాంతాలు, అభివృద్ధి పనులపై నిరంతర నిఘావుండే విధంగా రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి (సీసీఎఫ్) జేఎస్‌ఎన్ మూర్తి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాజమహేంద్రవరంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి డీఎఫ్‌వోలతో సమీక్షించారు. ప్రసిద్ధ పర్యాటక స్థలమైన కొల్లేరు పక్షుల అభయారణ్యం పొడవునా సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని ఈసందర్భంగా అధికారులను సీసీఎఫ్ ఆదేశించారు. పక్షుల సమూహాల ఆవాసానికి వీలుగా మరో ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లుచేయాలని, కొల్లేరు మొత్తమంతా సందర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్క ఆటపాక గ్రామం వద్ద మాత్రమే పక్షుల సందర్శనకు తగిన ఏర్పాట్లున్నాయి. ఇకపై మరో ఐదారు చోట్ల ఇలాంటి ఏర్పాట్లుచేయాలని ఆదేశాలిచ్చారు. కందకాల తవ్వకం ఇకపై అటవీ ప్రాంతం హద్దుల వెంబడి మాత్రమే సాగించాలని ఆదేశించారు. సందర్శకులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి పనిలోనూ నిర్ధేశిత ప్రమాణాల మేరకు పూర్తి నాణ్యత వుండేలా చూడాలని, అలాగే రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఒక రేంజి పరిధిలో జరుగుతున్న పనులను ఆ పక్క రేంజర్ తనిఖీ చేసేలా పర్యవేక్షణకు అప్పగించారు. నాణ్యతా ప్రాణాల్లో నిత్యం నిఘా వుండే విధంగా డీఎఫ్‌వోలు పరస్పర తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో డీఎఫ్‌వోల పర్యవేక్షణ, రేంజి, సెక్షన్ అధికారుల సమన్వయం అత్యంత కీలకమని మూర్తి అన్నారు. రాజమండ్రి, కాకినాడ, చింతూరు, ఏలూరు, విజయవాడ, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ తదితర డివిజన్ల వారీగా వివిధ పనులను, నర్సరీల తీరుతెన్నులను సీసీ ఎఫ్ మూర్తి సమీక్షించారు. ఇరవై ఏళ్ల కిందటి వరకు అటవీ శాఖ నర్సరీలు పిక్నిక్ స్పాట్‌లుగా ఉండేవని, ఇపుడు వాటి నిర్వహణ అధ్వాన్నంగా తయారైందని, దీన్ని పునరుద్ధరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వనం-మనం, నీరు-చెట్టు కార్యక్రమాలకు అవసరమైన మొక్కలను, రహదారుల వెంబడి ఎవెన్యూ ప్లాంటేషన్లు వేసేందుకు వీలుగా పొడవు మొక్కలను నర్సీరీల్లో సరైన ప్రమాణాల్లో పెంచాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డీఎఫ్‌వోలు నందని సలారియా, అనంత్ శంకర్, నాగేశ్వరరావు(ఏలూరు),శ్రీనివాస్ (చింతూరు), బెనర్జీ (విజయవాడ), రాజమండ్రి లాగింగ్ డీఎఫ్‌వో రాజశేఖరరావు, స్క్వాడ్ డీఎఫ్‌వో ఎంవి ప్రసాదరావు, కాకినాడ ఎస్‌ఎఫ్‌డీ ఎఫ్‌వో రామకృష్ణ, చింతూరు లాగింగ్ డీఎఫ్‌వో కొండలరావు పాల్గొన్నారు.