ఆంధ్రప్రదేశ్‌

దక్షిణ కోస్తా, సీమకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15:కర్నాటక నుంచి తమిళనాడు వరకూ నెలకొన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఉత్తర కోస్తాలో కూడా చెదురు మదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు. ఇక మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోత్రలు నమోదు కాగా, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఎక్కడా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటలేదు.