ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీని లాభాల్లోకి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: దాదాపు రూ. 4వేల కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజలకు చేరువ చేసి తద్వారా లాభాల బాటలో పయనింప చేసేందుకు తనవంతు కృషి చేస్తానని సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. ఇందుకు సిబ్బంది సహకారం అవసరమన్నారు. 29వ రోడ్డు భద్రత సదస్సు మంగళవారం సాయంత్రం ఆర్టీసీ భవన్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రమాదరహిత రికార్డు కల్గిన 51మంది డ్రైవర్లను అతి తక్కువ ప్రమాదరేటును నమోదు చేసిన ఆరు డిపోల మేనేజర్లను వారి సతీమణులతో కలిసి ఘనంగా సత్కరించారు. డ్రైవర్లను రాష్ట్ర స్థాయిలో ముగ్గురు, జోనల్ స్థాయిలో ముగ్గురు, జిల్లా స్థాయిలో ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు. వీరికి రూ. వెయ్యి, రూ. 2500లు వరకు నగదు బహుమతి అందించారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీ సురేంద్రబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరజ్ కుమార్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, జయరావు, మేనేజర్ పీవీ రామారావు, కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో కార్మికులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.