ఆంధ్రప్రదేశ్‌

కాలుష్య కారక పరిశ్రమలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రాష్ట్రంలోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడానికి రెండు నెలల్లో పర్యవేక్షణ వ్యవస్థ(మోనటరింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అటవీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ తెలిపారు. కేవలం మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొక్కల పెంపకంలో ప్రతినెలా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేలా చూడాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనంతరాములను ఆదేశించారు. మొక్కలు నాటిన నాటి నుంచి వాటి పెరుగుదలపై సమన్వయం చేసుకుంటూ కాలుష్యకారక పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇంతవరకూ ఎన్ని పరిశ్రమలపై కేసులు నమోదు చేశారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను సీఎస్ ప్రశ్నించారు. గిరిజనుల ఆదాయం పెంపుదలకు వారికి నైపుణ్య శిక్షణలు ఇవ్వాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులను సీఎస్ ఆదేశించారు. తేనె సేకరణలోనూ, కాఫీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లలోనూ పనిచేసే గిరిజనులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆదాయం పెంచేందుకు వీలవుతుందన్నారు.