ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర పండుగగా రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: రంజాన్ పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. స్థానిక చిట్టినగర్‌లోని ఈద్‌గాహ్ షాదీఖానాలో శుక్రవారం ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి అందజేవారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి జిల్లాలోను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారికంగా ఇఫ్తార్ విందును ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మీద 47 కోట్ల ఖర్చుతో 11 లక్షల మైనారిటీ కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ను అందిస్తామని మంత్రి చెప్పారు. ఇదేవిధంగా సంక్రాంతి పండుగకు కూడా చంద్రన్న సంక్రాంతి తోఫా అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముస్లిం, మైనారిటీలందరికీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మైనారిటీల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 713 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. షెడ్యూలు కులాల, తెగల వసతి గృహాల మాదిరిగానే ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీరికోసం ఇప్పటికే రూ.6చోట్ల స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇమామ్‌లు, మత గురువులైన ఇమామ్‌లు, మేసమ్‌లకు గౌరవ వేతనం అందజేస్తున్నామన్నారు. ఇమామ్‌లకు నెలకు రూ.5వేలు, మేసమ్‌లకు నెలకు రూ.3వేలు, నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నగరంలో ఇటువంటి ఆస్తులు 3వేల కోట్ల మేర ఉన్నాయని, వాటిని తిరిగి తీసుకుని వక్ఫ్ ఆదాయం పెంచి పేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. విజయవాడలో ‘హజ్‌హోస్’ ఏర్పాటు చేయనున్నామన్నారు.