ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’ కోసం కదిలిన మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అసెంబ్లీ, పార్లమెంట్ వీధి నాటకాల ద్వారా రాదని, ప్రజల ఐక్య, సమరశీల పోరాటాల ద్వారానే వస్తుందని ప్రత్యేక హోదా ప్రజల హోదాను పెంచే విధంగా ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ అధికార ప్రతినిధి జగబందు రాసిన సుదీర్ఘ లేఖను గురువారం మీడియాకు పంపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న రాష్ట్ర బంద్‌కు పిలునిచ్చారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల వారూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా నీరుకారిపోడానికి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే కారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. హోదా ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన పాలకల్లో లేకపోవడమే ఇంతదుకు కారణమని అన్నారు. ప్రత్యేక హోదా కింద ఏపీకి నిధులు తరలిస్తే, అంబానీ, అదానీ వంటి వారి ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. దేశ సంపదను బూర్జువాలకు కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. గత కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంతో ప్రజల్లో టీడీపీ, బీజేపీలపై అసహనం పెరిగిందని అన్నారు. చంద్రబాబు తనదైన శైలిలో నాటకాన్ని రక్తికట్టించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని అన్నారు.