ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఆర్టీసీకి రెండోస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: గతంలో కంటే ఆదాయం పెంచుకోవడంలోను, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో గణనీయమైన పురోగతి సాధించి, రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది ఆర్టీసీ విశాఖ రీజియన్. ప్రధానంగా వార్షిక ఆదాయాన్ని దాదాపు రూ.500 కోట్లకు పెంచుకోగలిగిన ఈ రీజియన్ సకాలంలో బస్సు సర్వీసులు నిర్వహించడంతో ప్రయాణికులకు మరింతగా చేరువైంది. అలాగే ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తూ జీరో స్థాయికి వీటిని తీసుకువచ్చే క్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేసవి, సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపటం, అక్యూఫెన్సీ రేషియా(ఓఆర్)ను 70కి పైగా పెంచడం, కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక అంశాలకు సంబంధించి ఈ రీజియన్ ముందంజలో ఉంటుంది. వీటన్నింటినీతోపాటు ద్వారకా బస్‌స్టేషన్‌తోపాటు జిల్లాలో వివిధ ముఖ్యమైన కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికుల వౌలిక వసతులను మెరుగుపర్చడం, రిజర్వేషన్ సదుపాయాన్ని సులభతరం చేయడం, పార్శిళ్ళ రవాణా ద్వారా దళారీ వ్యవస్థను నిర్మూలించడం వంటి చర్యల వల్ల ద్వితీయ స్థానానికి వెళ్ళింది. అయితే వీటన్నింటిలో ప్రగతి సాధించి, ప్రయాణికులకు మరింత చేరువై ఈ రీజియన్‌ను ప్రథమ స్థానానికి తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.