ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో కొత్తగా 831 డీఆర్ డిపోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మలక్ష్మీపురం, మే 17: రాష్ట్రంలో ప్రస్తుతం 902 డీఆర్ డిపోలతోపాటు కొత్తగా జాతీయ ఆహార పథకం కింద 831 డీఆర్ డిపోలను ఏర్పాటు చేయనున్నామని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాబూరావునాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురానికి గురువారం బాబూరావునాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు చేపడుతున్నామని, ఈపాస్, తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. గిరిజన సహకార సంస్థలను నిర్వీర్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. గిరిజనులు పండించే అటవీ ఉత్పత్తులకు తగిన మద్దతు ధర ప్రకటిస్తూ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా గుమ్మలక్ష్మీపురంలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈయన వెంట డీఎం భాస్కరరావు, మేనేజర్ వెంకటరమణ, సూపరింటెండెంట్ రాము, ఇబ్రహిం, తదితరులు పాల్గొన్నారు.