ఆంధ్రప్రదేశ్‌

రంజాన్‌తో సత్ప్రవర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: రంజాన్ ఎంతో పవిత్ర మాసమని, నెల రోజులు నిష్టగా చేసే దీక్షలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రంజాన్ మాస ప్రారంభ దినం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. ముస్లింలు ఈ నెల రోజులూ ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడుపుతారని అన్నారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే రంజాన్ మాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం, దయాగుణం, దానగుణం కలిగి ఉండటం సత్ప్రవర్తనకు మార్గాలని, భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని చంద్రబాబు అన్నారు. ఇవే లక్షణాలు అలవర్చుకుని జీవితమంతా కొనసాగించేందుకు రంజాన్ స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది (2018-19) రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి 1101.90 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.