ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ అంశాలను పరిష్కరించాలి: పితాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఈ అంశంపై ఆ శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఐటీఐలకు కేంద్రం నుండి రూ.3.5 కోట్లు రావాల్సి ఉందని, ఈఎస్‌ఐ ఆస్పత్రుల మరమ్మతులకు గత ఐదు సంవత్సరాలుగా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని మంత్రికి అధికారులు తెలిపారు. అమరావతి రీజియన్‌లో ఈఎస్‌ఐ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.