ఆంధ్రప్రదేశ్‌

బాబు ప్రచారం చేసిఉంటే మాకు మరిన్ని సీట్లు వచ్చేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: కర్నాటకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేసిఉంటే బీజేపీకి మరిన్ని సీట్లు వచ్చి ఉండేవని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులు, ఓ ఎన్జీవో నేత ప్రచారం చేసినప్పటికీ తాము ఎక్కువ సీట్లు సాధించగలిగామని తెలిపారు. కర్నాటక గవర్నర్ రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేశారు. గోవా ఎన్నికలలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకుని ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుందని, కానీ ఎన్నికల తర్వాత పొత్తు కారణంగా ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ నిపుణులను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కొంతమందిని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. తమను విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే గాజువాక నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంటూరు వద్ద లాంచి ప్రమాదంపై మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడం కన్నా జరిగిన తరువాత పోస్టుమార్టం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటని వ్యాఖ్యానించారు. నష్టపరిహారం ప్రకటించి, విచారణకు ఆదేశించడంతో సరిపెడతారన్నారు. ఇటువంటి ప్రమాదాలు నివారించేందుకు శాస్ర్తియ పద్దతిలో బోట్లు నడిపేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రమాదానికి గురైన లాంచిని నడిపేందుకు ఎవరు అనుమతించారని, ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ ఎవరిచ్చారని ప్రశ్నించారు.