ఆంధ్రప్రదేశ్‌

వేచి చూద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: కర్నాటక రాజకీయాలపై స్పందించేందుకు వేచి చూద్దామన్న పలువురు మంత్రుల అభిప్రాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. వేడెక్కిన రాజకీయాల నేపథ్యంలో కొద్ది రోజులు వేచి చూడటమే మేలని సీఎం కూడా భావిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులతో గురువారం సీఎం సమావేశమయ్యారు. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడంతో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం ఫోన్ చేసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లి సీఎం నివాసంలో చంద్రబాబు సహా, మంత్రులు కళా వెంకటరావు, లోకేష్, అచ్చెన్నాయుడు, తదితరులు సమావేశమై చర్చించారు. కుమారస్వామి విజ్ఞప్తిపై స్పందించే అంశంపై ఎక్కువగా చర్చ జరిగింది. బీజేపీ అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోందన్న అభిప్రాయాన్ని పలువురు మంత్రులు వ్యక్తం చేయడం గమనార్హం. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని కొంతమంది తప్పుపట్టినట్లు తెలిసింది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పామని, కానీ సిద్ధాంత పరంగా వ్యతిరేకించే కాంగ్రెస్‌కు ఓటు వేయమని ఎలా చెప్పగలమని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కర్నాటక రాజకీయాలపై వ్యాఖ్యానించకుండా, కొద్ది రోజులు వేచి, చూసి స్పందించడం మేలని పలువురు మంత్రులు చెప్పడంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
పొగాకు ధరపై సీఎం ఆరా
రాష్ట్రంలో పొగాకు ధర గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఆరా తీశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం కార్యాలయ అధికారులతో ఆయన పొగాకు ధరలపై సమీక్ష నిర్వహించారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్రంతో కూడా మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ కింద 500 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేశామన్నారు.