ఆంధ్రప్రదేశ్‌

పీజీ ఈసెట్-2018 ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ(జగదాంబ), మే 17: ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఎంటెక్, ఎం.్ఫర్మా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2018 పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖలో విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకూ రాష్ట్రంలో 12 జిల్లాలోని 35 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించామని, ఈ ఏడాది 29,399 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 26,779 మంది హాజరయ్యారన్నారు. 23,831 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 88.99 ఉత్తీర్ణత శాతం నమోదైయిందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 22,010 మంది అభ్యర్థులకు 19,565 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, 88.89 శాతం నమోదైందని, ఎం.్ఫర్మా విభాగంలో 4,769 మంది అభ్యర్థులకు, 4,266 మంది ఉత్తీర్ణత సాధించగా, 89.45శాతం నమోదైందని పేర్కొన్నారు. అలాగే ఎంటెక్‌కు సంబంధించి 365 కళాశాలలో 27,300 సీట్లు ఉన్నాయని, ఎం.్ఫర్మాకు సంబంధించి 81 కళాశాలలో 2,787 సీట్లు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ పరీక్షలలో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ప్రామేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రాకల్ ఇంజనీరింగ్, నానోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో అభ్యర్థులు అధికంగా పరీక్ష రాశారన్నారు. ఇందులో విజయనగరం 91.11 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, అనంతపురం 97.78శాతం చివరి స్థానంలో నిలిచిందని, ఈ నెల 20వ తేదీ నుంచి అభ్యర్థులు ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. ఏయూ ఆధ్వర్యంలో రెండో సారి ఈ సెట్‌ను విజయవంతంగా నిర్వహించామని, అకడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా పరీక్షలను నిర్వహించడంలో జాతీయస్థాయిలోనే ఏపీ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, సెట్ కన్వీనర్ పీఎస్ అవధాని, సెట్ స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్, సెట్ మెంబర్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.

చిత్రం.. ఫలితాల సీడీని విడుదల చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు,
ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, సెట్ కన్వీనర్ పీఎస్ అవధాని