ఆంధ్రప్రదేశ్‌

మహానాడు ఏర్పాట్లపై సీఎం సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: జాతీయ మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మహానాడు నిర్వహణకు సంబంధించి నేతలు, వివిధ కమిటీల ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. మహానాడు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పండుగలా నిర్వహించాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడా లోపాలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కేంద్రం వైఖరి, కర్నాటక రాజకీయాల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేలా నిర్వహించాలని తెలిపారు. వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న మిని మహానాడుపై సమీక్ష చేశారు.