ఆంధ్రప్రదేశ్‌

ఎస్సైన్‌మెంట్ కమిటీల ఏర్పాటు: కేఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు భూములను పంపిణీ చేసేందుకు ఎస్సైన్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఈ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎస్సైన్‌మెంట్ కమిటీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా ఆ జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, సంబంధిత ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ ఉంటారన్నారు. ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్న ఎమ్మెల్సీ ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉంటారన్నారు. జేసీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.