ఆంధ్రప్రదేశ్‌

ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 17: ప్రకృతి అనుకూలించక జరిగిన ప్రమాదాలను కూడా ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కోణంలో చూడటం దుర్మార్గమని రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రతి సంఘటనను వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. హృదయ విదారకరమైన ఘటనలనూ రాజకీయం చేయడం ప్రతిపక్ష నేత జగన్‌కే చెల్లిందన్నారు. పడవ ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. గోదావరి లాంచీ ప్రమాదంలో ప్రతిపక్ష నేత జగన్ స్పందించక పోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న ఎవరైనా ఈ ఘటనపై స్పందిస్తారని, అయితే జగన్ వైఖరి మాత్రం సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేందుకు పాదయాత్రకు విరామం ఇచ్చే జగన్‌కు ప్రమాదంలో చనిపోయిన గిరిజనుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేకపోయిందా అని ప్రశ్నించారు. పైగా ఇవన్నీ సర్కారు హత్యలంటూ మాట్లాడటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. స్వయంగా ముఖ్యమంత్రే ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. అంతేకాక ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లిస్తుందన్నారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న హయాంలో ప్రకృతి వైపరీత్యాలకు ఎంతోమంది మృత్యువాత పడ్డారని, మక్కా మసీదులో పేలిన బాంబులు నాటి ప్రభుత్వమే పెట్టిందా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం జగన్‌కు పరిపాటిగా మారిందని, ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
జనసంఘ్ కార్యకర్తలా కన్నా మాట్లాడటం విడ్డూరం...
మరోవైపు లాంచీ ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. కన్నా స్వచ్ఛమైన సంఘ్ కార్యకర్తలా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. స్వప్రయోజనాల కోసం, పదవుల కోసం వెంపర్లాడే కన్నా వారం రోజుల్లో రెండు పార్టీలతో దోబూచులాడారన్నారు. అటువంటి కన్నా నేడు ప్రభుత్వానికి నీతులు చెప్తున్నారని ఆనందబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సీఎం పదవి కోసం కుయుక్తులు పన్నిన కన్నా నేడు బీజేపీ అధ్యక్ష పదవి కోసం కూడా డ్రామాలాడారన్నారు. కన్నాకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు అవసరం లేదని తన స్వప్రయోజనాలే ముఖ్యమని ధ్వజమెత్తారు.