ఆంధ్రప్రదేశ్‌

నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: ప్రకాశం జిల్లా చీరాల వడ్డెర కాలనీకి చెందిన తిరుపతిరావు తన మేధాశక్తితో విద్యుత్ స్తంభాలను సులువుగా ఎక్కేందుకు వినూత్నంగా తయారుచేసిన పోల్ క్లైంబర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈనెల 11తేదీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్టప్రతి రాంనాధ్ కోవింద్ సమక్షంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జ్ఞాపిక, మూడు లక్షల నగదుతో తిరుపతిరావును సత్కరించారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడ విద్యుత్ సౌధలో తిరుపతిరావును ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ కె.విజయానంద్, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో డాక్టర్ వల్లీకుమారి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇలాంటి వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు రావడం చాలా అరుదుగా ఉంటుందని, ఇటువంటి వినూత్న ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని కె.విజయానంద్ తెలిపారు. ఇప్పటికే ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా రాష్ట్రం మొత్తం మీద వినూత్నంగా కొత్త ఆవిష్కరణల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తోందని విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడు, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పామని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారుచేసే కార్యక్రమం కూడా కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన ఆవిష్కరణలకు కావలసిన మార్కెటింగ్, పని చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందని, దీనికి సంబంధించిన పెట్టుబడిదారులను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు విజయానంద్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి, డైరక్టర్లు సుబ్రహ్మణ్యం, వై.యాడమ్, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.