ఆంధ్రప్రదేశ్‌

గిట్టుబాటు ధర కోసం ఆలయ గోపురం ఎక్కిన రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మే 17: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంతలో ఓ రైతు శివాలయం గోపురంపైకి చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు రంగంలోకి రైతును కిందికి దించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రైతులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లతో తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ధాన్యాన్ని రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఇంతలో రాజుపాళెం మండలం పర్లపాడుకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డి పట్టణంలోని ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయ గోపురం పైకి చేరుకున్నాడు. రైతుల సమస్యలపై స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో రైతు కిందికి దిగివచ్చాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం..గోపురంపైకి ఎక్కిన రైతు