ఆంధ్రప్రదేశ్‌

బ్లాక్‌మనీ, బ్లాక్‌మెయిలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: ‘బ్లాక్‌మనీ, బ్లాక్ మెయిల్’ రాజకీయాలతో బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. కర్నాటకలో ఆ విధానాలనే అనుసరించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైందని, గవర్నర్ కూడా హైడ్రామా నడిపి బీజేపీకి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం విజయవాడ దాసరి భవన్‌లో కత్తి నరసింహారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ జాతీయ రాజకీయ పరిణామాలను వివరించారు. ఇటీవల కేరళ రాష్ట్రం కొల్లాంలో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల నిర్ణయాలను తెలిపారు. సీపీఐ జాతీయ సమితి నిర్ణయం మేరకు దేశంలో నానాటికీ పెరుగుతున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో వామపక్ష అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మోదీ అప్రజాస్వామిక విధానాలు కర్నాటక ఎన్నికల్లో మరింత బహిర్గతమయ్యాయన్నారు. 1.5 శాతం ఓట్లు తక్కువగా వచ్చి, 8మంది శాసనసభ సభ్యులు తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించి, మెజార్టీ ఓట్లు, సీట్లు ఉన్న కాంగ్రెస్, జేడీఎస్‌లను ఆహ్వానించకపోవడం అప్రజాస్వామ్య పాలనకు పరాకాష్ట అన్నారు. అటు జ్యుడీషియరీ, ఇటు గవర్నర్ వ్యవస్థ రెండింటినీ కబళించిన ప్రధాని మోదీ డైరెక్షన్ మేరకు కర్నాటకలో ప్రజాస్వామ్యం తల్లకిందులైందన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించాక ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగిపోతుందని ఘంటాపథంగా చెప్పిన మోదీ మాటలేమయ్యాయని ప్రశ్నించారు. సాక్షాత్తూ ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.50 కోట్లు ఖర్చు పెట్టిన ఉందంతాలు చూశాక మోదీ మాటలు నీటి మూటలలేనని స్పష్టమైందన్నారు. నోట్ల రద్దు తర్వాత వరుసగా జరిగిన ఎన్నికలు చూస్తుంటే బీజేపీ వైపు నుండి ధన ప్రవాహం 100 శాతం ఎక్కువైందనీ, దీన్నిబట్టి నోట్ల రద్దుకు ముందే ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్‌పటేల్, మోదీ ముందస్తు పథకంలో బ్లాక్‌మనీ మొత్తం వైట్‌మనీగా మారిపోయిందన్నారు. ఏకపక్షంగా ధన ప్రవాహం జరిగే విధంగా రూపకల్పన జరిగిపోయిందన్నారు. దీని ఫలితమే కర్నాటకలో నైతికంగా ఓడిపోయిన బీజేపీ సాంకేతికంగా ముఖ్యమంత్రి పదవి స్వాధీనం చేసుకుందన్నారు బలపరీక్షకు 15 రోజులపాటు అవకాశం ఇవ్వడమంటే సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించడంతోపాటు ఏప్రిల్ నెలలో కడప నగరంలో జరిగిన రాష్ట్ర 26వ మహాసభలు పార్టీకి కొత్త ఉత్సాహానిచ్చాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై చేపట్టిన దీక్షలకు సీపీఐ మద్దతు తెలుపుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా సీపీఐ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించుకుని భావి పోరాటాలకు నడుం కట్టాలన్నారు. ఈనెల 22 నుండి అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షలను జయప్రదం చేయాలని, మే 16 నుండి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగే ప్రచార జాతాలను, మే 23న విజయవాడలో జరిగే ర్యాలీ విజయవంతానికి కృషి చేయాలని, ఇళ్లు, ఇళ్ల స్థలాల కొరకు ఎదురు చూస్తున్న జనాన్ని రాష్టవ్య్రాప్తంగా లక్షలాది మందిని సమీకరించి భారీఎత్తున ఉద్యమం చేపట్టాలన్నారు. మే 21వ తేదీన విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధన కోసం రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం నుండి విశాఖపట్నం వరకు జరిగే రైలు యాత్రను జయప్రదం చేయాలని, మే 30, 31 తేదీల్లో గుంటూరు నుండి అమరావతి వరకు జరిగే అగ్రిగోల్డ్ బాధితుల ‘ఆత్మ ఘోష’ పాదయాత్రకి మద్దతు తెలపాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్‌ను నీరుగారుస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన మిలీనియం మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరైంది కాదన్నారు.

చిత్రం..సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జాతీయ కార్యదర్శి కే నారాయణ