ఆంధ్రప్రదేశ్‌

పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలేటివారిపాలెం : పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడీ అని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టు కట్టి రైతులకు నీరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో పోకూరు గ్రామంలో నీరు- ప్రగతి కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. కందులు,శనగలు, ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, పొగాకును కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చాలన్నారు. ఎక్కడి నీటిని అక్కడే భూమిలోకి ఇంకేలా చేస్తే భూగర్భజలాలు పెంచవచ్చునన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకువచ్చి రాయలసీమకు నీరిచ్చిన ఘనత మనకే దక్కిందన్నారు . వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించింది తానేనని పూర్తి చేసే అదృష్టం కూడా నాకే దక్కిందన్నారు. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. పోలవరంలో 300 అడుగుల లోతు నుండి కాంక్రీట్ వేసి నీరు ఇంక కుండా అభివృద్ది చేస్తుంటే ప్రతిపక్షనేత నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న మీ అందరి అభివృద్ధి కోసం భరిస్తున్నానని అన్నారు. ప్రతి శుక్రవారం జైలుకు వెళ్లి వచ్చే ముద్దాయిలు నన్ను విమర్శిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని ఒక్కమాట కూడా అనకుండా కేవలం కేసుల మాఫీ కోసం కేంద్రంతో బేరసారాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం మనకు తీవ్ర అన్యాయం చేస్తోందని అయినా అభివృద్ధి ఆగదని కేంద్రం పై పోరాటాలు కొనసాగిస్తామే కానీ రాజీ పడబోమన్నారు. ప్రతి నీటిబొట్టును వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని నీటిభద్రతను పెంచవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, శిద్దా రాఘవరావు, నారాయణ, కలెక్టర్ వినయ్‌చంద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు జెసిబి యంత్రంతో చెరువులో పూడిక తీత పనులు ప్రారంభించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

చిత్రం..పోకూరు చెరువులో ప్రొక్లెయిన్‌తో మట్టిని తీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు