ఆంధ్రప్రదేశ్‌

టీడీపీయే కాపులను ఆదుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 18: కాపులను బీసీల్లో చేర్చుతామని ప్రకటించే దమ్ము విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఉందా అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పి పాదయాత్రలో ముందుకు నడవాలని జగన్‌కు సవాల్ చేస్తున్నానన్నారు. ఇన్నాళ్లూ కాపులను ఓటు బ్యాంకుగా వాడుకున్న పార్టీలకు భిన్నంగా వారిని బీసీల్లో చేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన ఆదరణ-2 అవగాహన సదస్సు, ఉపకరణాల ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఇంత వరకు జగన్ ఎక్కడా చెప్పలేకపోయారన్నారు. అతనికి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆదరణ-2 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్నారన్నారు. జిల్లాలు, డివిజన్ల వారీగా చేతివృత్తి పనిముట్ల ప్రదర్శనా స్టాళ్లు ఏర్పాటుచేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి, వారు ఎంచుకున్న పరికరాలనే అందిస్తామన్నారు. రాష్ట్ర జనాభాలో 49 శాతం ఉన్న బీసీలకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే గుర్తింపు లభించిందన్నారు. అందుకే అధికారంలో ఉన్నా, లేకపోయినా టీడీపీ వైపే బీసీలు ఉంటున్నారన్నారు. తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో రూ.12,800 కోట్లు బీసీల కోసం ఖర్చుచేసిందన్నారు. రూ.12వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్‌ను అమలుచేస్తోందన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరించనందున ప్రభుత్వమే స్వయంగా రుణాలు కల్పించే చర్యలు చేపట్టిందన్నారు.