ఆంధ్రప్రదేశ్‌

కుటుంబ నియంత్రణ పక్కన పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తిరోగమన దశలో వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో తాము కుటుంబ సంక్షేమ ప్రోత్సాహంపై తీసుకున్న చర్యలే ఇందుకు కారణమన్నారు. పశ్చిమ దేశాలు చైనా, జపాన్ వంటి దేశాల్లో జనాభా తగ్గుదల ఆందోళనకరంగా వుందంటూ తగినంత జనాభా లేక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నారన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ప్రస్తుతానికి లేనప్పటికీ జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అంటూ, కుటుంబ నియంత్రణను కొంతకాలం పక్కన పెట్టాలన్నారు.ప్రతి ఒక్క పౌరుడూ ఆరోగ్యంగా వుండేందుకు ఆటలు, తేలికపాటి వ్యాయామం అవసరమన్నారు. సాయం సమయంలో పబ్బులు, బార్లకు బదులు క్రీడా మైదానాల్లో వుండేందుకు పౌరులందరూ ప్రాధాన్యతనివ్వాలన్నారు.
నా ఆరోగ్య రహస్యానికి కారణాలివే
ఇంత వయస్సులోను తాను నిద్రహారాలు లేకుండా పనిచేయటానికి, తన ఆరోగ్య రహస్యానికి కారణాలను సిఎం మర్మగర్భంగా చెప్పారు. నిరంతరం శ్రమించటం, ఒక పనిలో విసుగు చెందితే మరొక పనిలో ఆనందించటం తన హాబీ అన్నారు. వ్యాయామంతోపాటు మితాహారం, మంచి ఆలోచనలు తనను ఎప్పుడూ చురుగ్గా వుండేలా చేస్తున్నాయన్నారు. క్రీడల శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో క్రీడల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.30 కోట్ల నుంచి రూ.230 కోట్లకు పెంచారంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సభలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం, పాఠశాల ప్రత్యేక విద్యాకమిషనర్ సంధ్యారాణి పాల్గొన్నారు.