ఆంధ్రప్రదేశ్‌

నేరుగా వస్తా.. అభివృద్ధి చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నర్సరీ, రహదారి అభివృద్ధి పనుల పురోగతిని శనివారం ఉదయం తాను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. తనతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ ముఖ్యలు ఈ పర్యటనలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏపై జరిగిన సమీక్షలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి అభ్యర్థన మేరకు కొత్త నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడానికి ఆయన అంగీకరించారు. హైదరాబాద్‌లో పదే పదే క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి అధికారులను పరుగులు పెట్టించేవారని, అలాగే ఇక్కడ కూడా జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించడానికి రావాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి మార్గానికి ఇరువైపులా అందమైన పుష్పజాతులకు చెందిన చెట్లను పెంచాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు. సీఆర్‌డీఏ పరిధిలో అర ఎకరం నుంచి 60 ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్న మొత్తం 69 ఉద్యాన వనాలను పచ్చదనంతో ఆకర్షణీయంగా రూపొందించాలని ఆదేశించారు. ఈ ఉద్యాన వనాల్లో యోగా, జిమ్ తదితర సదుపాయాలను కల్పించాలని చెప్పారు. ప్రతి ఉద్యాన వనంలో సామాన్యులు ప్రకృతిని ఆస్వాదిస్తూ యోగా, కసరత్తులు చేసే సదుపాయాలు ఉండేలా చూడాలని సూచించారు.