ఆంధ్రప్రదేశ్‌

‘బీజేపీ గెలుపును జీర్ణించుకోలేకనే విమర్శలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఎన్నిక కావడాన్ని ఓర్వలేక విపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక వ్యతిరేక శక్తులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. కన్నడ ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించారని, సీఎం సిద్ధరామయ్యతో సహా 16 మంది మంత్రులు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్‌లు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయన్నారు. ప్రజలు 104 మందిని గెలిపించి బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినందున గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరారని స్పష్టం చేశారు. కాని బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక బద్ధశత్రువులైన కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసిపోయి బీజేపీపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కర్నాటకలో బీజేపీని ఓడించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని కన్నడ ప్రజలు పట్టించుకోలేదని సురేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును చూసిన తర్వాతైనా చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌పై పోరాడలేని కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర అంతర్గత వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జోక్యాన్ని ఖండించారు. రాయలకాలం నాటి శ్రీవారి ఆభరణాల గురించి ప్రశ్నించినందునే వంశపారంపర్య పౌరోహిత్యం చేస్తున్న రమణదీక్షితులను తొలగించారని ఆరోపించారు. టీటీడీలో తలదూర్చినట్లు మదర్సాలు, చర్చిల అంతరంగిక విషయాల్లో ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోగలదా అని ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సగ్గుర్తి శ్రీనివాసరావు, మీడియా రాష్ట్ర ఇన్‌ఛార్జి పి.దిలీప్ పాల్గొన్నారు.