ఆంధ్రప్రదేశ్‌

ఇక వార్షిక బస్సు పాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: విద్యార్థుల కోరిక మేరకు నెలనెలా, మూడు నెలలకోసారి బస్‌స్టేషన్‌ల చుట్టూ తిరగకుండా ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వార్షిక బస్సు పాస్‌లు జారీ చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. సంస్థ నూతన చైర్మన్ వర్ల రామయ్య, ఎండీ సురేంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్షిక బస్సు పాసుల వల్ల విద్యార్థులు సంవత్సరానికి ఒకసారి బస్సు పాస్ కౌంటర్ల వద్ద బస్సు పాసులు తీసుకుని విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా బస్సు పాసు రెన్యువల్‌కు అయ్యే ఖర్చు రూ.200 ఆదా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మూడు నెలలకోసారి జారీచేసే బస్సు పాసులు యథావిధిగా కొనసాగిస్తారు. నెలవారీ జారీచేసే బస్సు పాసులను మాత్రం ఇప్పుడు నిలిపివేస్తారని ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జయరావు ఆంధ్రభూమి ప్రతినిధితో తెలిపారు.