ఆంధ్రప్రదేశ్‌

కర్నాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: ఒక్క కలం పోటుతో కర్నాటక గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని, భారత రాజ్యాంగాన్ని పట్టపగలు హత్యచేశారని, ప్రజాస్వామ్యవాదులు అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్న గవర్నర్, బీజేపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో యనమల ఆరోపించారు. గవర్నర్‌కున్న విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారం అంటే పక్షపాతంతో వ్యవహరించేది కాదని, అత్యంత జాగ్రత్తగా వినియోగించేదే విచక్షణాధికారమని యనమల అన్నారు. హేతుబద్ధత ఉంటేనే విచక్షణాధికారం వినియోగించాలని, దానివల్ల ఉత్పన్నమయ్యే మేళ్లు, కీడు అంచనా వేయాలని, తప్పొప్పులను ముందే సమీక్ష చేయాలని సత్యానికి, ప్రజాహక్కుల పరిరక్షణకే విచక్షణాధికారం ఉంటుందన్నారు. కర్నాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదని, ప్రభుత్వం ఏర్పాటుచేసే హక్కు లేదని, ప్రజాబలంలో నిజం లేదని, అటువంటప్పుడు బీజేపీకి గవర్నర్ ఎందుకు అవకాశం ఇచ్చారని యనమల ప్రశ్నించారు. విచక్షణాధికారంపై అనేక అంతర్జాతీయ తీర్పులు ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా కర్నాటక గవర్నర్ వ్యవహరించారు. విచక్షణ లేకుండా సొంతంగా అధికారం వినియోగించి, ప్రజాస్వామ్యాన్ని కర్నాటక గవర్నర్ పరిహాసం చేశారన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్ భారత రాజ్యాంగానికి ద్రోహం చేశారన్నారు. మెజార్టీలేని పార్టీని ఆహ్వానించి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు అవకాశం కల్పించారన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రానికో రకంగా వ్యవహరించరాదని, దేశం మొత్తం ఒకే విధానం అనుసరించాలని, ఒకే ప్రజాస్వామ్య సాంప్రదాయం పాటించాలన్నారు. కర్నాటకలో బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. కర్నాటక గవర్నర్ తప్పును కొంతమేర సుప్రీంకోర్టు చక్కదిద్దిందని యనమల అభిప్రాయపడ్డారు.