ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు భరోసా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను మహానాడు వేదికగా ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మహానాడు ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మహానాడు ఏర్పాట్లపై సీఎం శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల అభివృద్ధిని సమీక్షించాలని పేదల సంక్షేమాన్ని వివరించాలని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించేవాళ్లమన్నారు. ప్రస్తుతం గాలి జనార్ధనరెడ్డిపై కేసులు బలహీనమయ్యాయని రేపు జగన్మోహన్‌రెడ్డిపై కేసులు కూడా బలహీనమవుతాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలు లేవని ఆరోపించారు. మహానాడును వినూత్నంగా నిర్వహించాలని, ప్రజల్లో మహానాడుపై చాలా అంచనాలు ఉన్నాయని అన్నారు. మహానాడులో నాడు, నేడు, రేపు అన్న అంశంపై విశే్లషణ చేయాలన్నారు. నాడు ఎలా ఇబ్బందులు పడ్డారు, నాలుగేళ్లలో ఏం చేశాం, రేపటి అంశాలు ఏమిటి అన్నది సమగ్ర చర్చ జరగాలన్నారు. తాము ఎన్నో పనులు చేశామని, అందుకే ప్రజల్లో సంతృప్తి ఉందన్నారు. మొన్న గుంటూరులో ఒక చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసానికి ప్రణాళిక రూపొందించారన్నారు. గుంటూరు ఘటన అవగానే తిరుపతి పథకం రచించారన్నారు. రమణదీక్షితుల ద్వారా బురద జల్లుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే సాకుతో చర్యలు తీసుకోవాలని చూస్తున్నారన్నారు. మహానాడుకు 25వేల మంది ప్రతినిధులు వస్తారని, వీరికి వసతి ఏర్పాట్లకు తగిన ప్రాంగణాలు గుర్తించాలన్నారు. 6వేల మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 9వేల వాహనాల పార్కింగ్, వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. బస, పార్కింగ్ ఎక్కడన్నది ముందుగానే తెలియజేయాలన్నారు. రాష్ట్ర విభజన తరువాత విజయవాడలో నిర్వహిస్తున్న తొలి మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.