ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో బోట్ మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 18: పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునక దుర్ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా మాదిరిగా బోటు మాఫియా తయారైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానే్న శాసించే స్థాయికి మాఫియా కార్యకలాపాలు ముదిరిపోయాయని, వీటిని నియంత్రించాలని నారాయణ అన్నారు. విజయవాడలో బోటు ప్రమాదం జరిగి తన బంధువులు చనిపోయినప్పుడు బోటు మాఫియా ఆగడాలను అరికట్టాలని, నదుల వద్ద బోటులు నడవటం సహజమని, ఐతే జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయిందని నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వసపిట్ట మాదిరిగా మాట్లాడుతున్నారని, నేల విడిచి సాము చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. 2019 నాటికి రాష్ట్రంలో 21 లక్షల ఇళ్లు పేదలకు నిర్మిస్తామని చెప్పారని, పేదలు నిజమని నమ్మి ఉన్న ఇళ్లును పడగొట్టుకున్నారని, కొత్త ఇళ్లు రాక ఉన్న ఇల్లు కూల్చుకుని రెండూ పోయి పేదలు వీధిన పడ్డారని, మరో ఏడాది మాత్రమే సమయం ఉన్నందున ఇన్ని లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారని నారాయణ ప్రశ్నించారు. ఇళ్లు కట్టాలని ముఖ్యమంత్రిని నిలదీస్తూ సీపీఐ ఆందోళనకు సిద్ధమవుతోందని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని, పవన్‌కల్యాణ్ సారధ్యంలోని జనసేనతో పొత్తు విషయమై ఆలోచిస్తామని నారాయణ అన్నారు. వైసీపీనేత జగన్ కేసుల నుంచి బైటపడేందుకు తన పార్టీని , వ్యక్తిత్వాన్ని నరేంద్రమోదీ వద్ద తనఖా పెట్టారని, బీజేపీపై ఆయన ఎటువంటి విమర్శలు చేయక పోవడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోందని నారాయణ అన్నారు. ప్రత్యేకహోదా అంశం వచ్చే ఎన్నికల్లో ప్రధాన నినాదంగా ఉంటుందన్నారు. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ గవర్నర్ కేంద్రానికి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారమే బల నిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వటం సంతోష దాయకమని ఆయనన్నారు. కర్నాటకలో బీజేపీ ఒక్కో నియోజకవర్గానికి 20 నుంచి వంద కోట్ల వరకు ఖర్చు చేసిందని, ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఎమ్మెల్యేలను కొనేందుకు వందకోట్లు ఆఫర్ చేస్తున్నారని, నల్లధనం తెస్తానని చెప్పిన నరేంద్రమోదీ 17 నెలల క్రితమే ఆర్‌బీఐ గవర్నర్‌తో కుమ్మక్కై నోట్లు రద్దు పరిచి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుని ఎన్నికల్లో వినియోగిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. కర్నాటకలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య లాంటి వారిని విమానం ఎక్కకుండా నిరోధించడం దారుణమన్నారు. నరేంద్రమోదీ పద్ధతులు మార్చుకోకుంటే కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమని నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజుల్లో ముగియనున్న గ్రామపంచాయితీ పాలకవర్గాలకు గడువులోగా ఎన్నికలు జరిపి తీరాలని, వాయిదా వేస్తే సీపీఐ పక్షాన ఆందోళన జరుపుతామని నారాయణ పేర్కొన్నారు.