ఆంధ్రప్రదేశ్‌

ఎవరెస్టు అయితే మాకేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి/ద్వారకాతిరుమల, మే 18: ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అవలీలగా అధిరోహించేస్తున్నారు గోదావరి జిల్లాల కుర్రోళ్లు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలానికి చెందిన ఒక విద్యార్థి, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన మరో విద్యార్థి గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన బృందంలో సభ్యులుగా ఉన్నారు. అలాగే రాజవొమ్మంగి మండలానికే చెందిన మరో విద్యార్థి శనివారం నాటికి అధిరోహించే బృందంలో సభ్యునిగా ఉన్నాడు. రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ అడ్డతీగల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గురువారం ఎవరెస్టును అధిరోహించిన నలుగురు విద్యార్థుల బృందంలో ప్రసన్నకుమార్ ఉన్నాడు. ప్రసన్నకుమార్ తండ్రి వ్యవసాయ కూలీ. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన పొడుగోలు భాను సూర్యప్రకాష్ ఎవరెస్టును అధిరోహించిన బృందంలో ఉన్నాడు. ప్రస్తుతం కొత్తూరు గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆ కళాశాల పీడీ ప్రోత్సాహంతో పర్వతారోహణపై తర్ఫీదు పొందాడు. ప్రకాష్ తండ్రి ఆటో డ్రైవర్.
ఎవరెస్టుకు చేరువలో మరో విద్యార్థి
కాగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి కొన్ని మీటర్ల దూరంలోనే రాజవొమ్మంగి మండలం మారేడుబాక పంచాయతీ మంగంపాడుకు చెందిన మాడెం సత్యనారాయణ ఉన్నాడు. సత్ననారాయణ కూడా అడ్డతీగల గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సత్యనారాయణ శనివారం ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించనున్నట్టు సమాచారం.

చిత్రాలు.. ప్రసన్నకుమార్, భాను సూర్యప్రకాష్