ఆంధ్రప్రదేశ్‌

డీసీసీబీల్లో సీఈఓల పదవీ విరమణ వయసు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 19: అన్నదాతను అన్నివిధాలా ఆదుకునే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఇఓ)ల పదవీ విరమణ వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. దీనివల్ల సహకార వ్యవస్థపట్ల ఏళ్ళతరబడి అనుభవం కలిగి ఉండే సీఈవోలతోనే రైతులకు మేలు జరుగుతుందని భావించిన ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును ఇటీవల 62ఏళ్ళకు పెంచింది. వాస్తవానికి 58ఏళ్ళకు పదవీ విరమణ చేయాల్సి ఉన్నా మరో నాలుగేళ్ళపాటు అదనంగా పనిచేసే అవకాశం సీఈవోలకు లభిస్తుంది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో కొనసాగుతున్న సీఈవోల్లో 60 శాతం మంది ఇన్‌చార్జీలుగానే విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా కొనసాగుతున్న వారిని పూర్తిస్థాయి సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వయోపరిమితి పెంపుతో మళ్ళీ నాలుగేళ్ళపాటు అవకాశం వచ్చే సిఇఓలను ఆర్ధికంగా బలహీనపడిన డిసీసీబీలకు నియమించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే ఇటీవల ప్రకటన కూడా చేయడంతో ఈమధ్య రిటైరైన వారంతా దరఖాస్తు చేసుకున్నారు. ఏపీకి చెందిన సీఈవోలు తెలంగాణాలో కూడా పనిచేసే అవకాశాలున్నందున ఎవరికీ వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ప్రశాశం,కడప, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు తదితర జిల్లాలకు సంబంధించి సీఈవోలుగా అవకాశం రానిపక్షంలో తెలంగాణా రాష్ట్రంలోనైనా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికి తెలంగాణా ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందనేది సందేహం. రిటైరైన సీఈవోలకు అవకాశం లభిస్తున్న వీరి ఎంపిక ప్రక్రియకు నలుగురితో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించినట్టు తెలిసింది. ఈ కమిటీలో నాబార్డు, ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్)ల నుంచి ఒక్కో అధికారి ఉంటారు. అలాగే ప్రతి జిల్లాకు చెందిన డీసీసీబీ నుంచి ఇద్దరు అధికారులు ఈ కమిటీలో బాధ్యతగా వ్యవహరిస్తారు. నలుగురితో కూడిన కమిటీ త్వరలోనే దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తొలుత ఇన్‌చార్జీలుగా వ్యవహించే డీసీసీబీలపైన ప్రత్యేక దృష్టిసారించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలురకాలైన పథకాలను పటిష్టవంతంగా అమలు చేయగలిగిన, వ్యాపారాన్ని అనూహ్యంగా పెంచగలిగే వారిని పూర్తిస్థాయి సీఈవోలుగా నియమించాలనే ఆలోచనకు వచ్చింది.