ఆంధ్రప్రదేశ్‌

కర్నాటకలో ప్రజాస్వామ్యం వర్ధిల్లింది: మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 19: అధికారం కోసం ఎన్ని కుట్రలు పన్నినా కర్నాటకలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కుతుందని ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. కర్నాటక ఎన్నిక ఫలితాల అనంతరం కర్నాటక ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించలేదన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి బీజేపీ తనకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన వారిని కాదని, అతిపెద్ద కూటమికే అధికారం కట్టబెట్టించి, విజయాలను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ కర్నాటక విషయంలో మాత్రం అతిపెద్ద పార్టీ అంటూ మాటమార్చిందన్నారు. కర్నాటకలో బీజేపీ అధికార క్రీడలో రాష్ట్ర గవర్నర్ కీలకపాత్ర పోషించడం మరో విపరీత పరిణామంగా పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. ఇక అసెంబ్లీని నడపాల్సిన ప్రోటెం స్పీకర్ నియామకం విషయంలో కూడా గవర్నర్ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారన్నారు.