ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యమే గెలిచింది: అచ్చెన్నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 19: కర్నాటక రాజకీయ పరిణామాల్లో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ యడ్యూరప్ప రాజీనామా రాజకీయ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించిందన్నారు. బీజేపీ కుటిల రాజకీయాన్ని యావత్ దేశమంతా చూసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జేడీఎస్‌కు అభినందనలు తెలిపారన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ముందు జాగ్రత్త బీజేపీ చిల్లర రాజకీయాలు చెల్లుబాటు కాలేదన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా గత మూడు రోజులుగా ఆడిన డ్రామాలపై ప్రజా స్వామ్య వాదులంతా ఆందోళనకు గురయ్యారన్నారు. బీజేపీ నిర్ణయాలను సుప్రీం కోర్టు తిప్పి కొట్టేలా తీర్పులివ్వడం సంతోషదాయకమన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి మన రాష్ట్రంలో కర్నాటక మాదిరిగా నాటకాలాడుతున్నాయని విమర్శించారు. కర్నాటక రాజకీయ పరిణామాలపై జగన్ మాట్లాడకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయమన్నారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు నిజాయితీగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని బతికించారన్నారు. ఇకనైనా బీజేపీ, వైసీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.