ఆంధ్రప్రదేశ్‌

రమణ దీక్షితులు వ్యాఖ్యలు ఆపరేషన్ గరుడలో భాగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 19: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ఆచార్యులుగా పనిచేసిన రమణ దీక్షితులు ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలపై చేసిన వ్యాఖ్యలు ఆపరేషన్ గరుడలో ఒక భాగమేనని బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో శ్రీ్ధర్ మాట్లాడుతూ రమణ దీక్షితులను బీజేపీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీటీడీలో వెంకటేశ్వర స్వామికి ప్రధాన అర్చకులుగా నాలుగు కుటుంబాలు మాత్రమే అనువంశిక అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నాయని, ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తి అయిన రమణ దీక్షితులు మిగిలిన మూడు కుటుంబాల వారికి అర్చకత్వం చేయనీయకుండా అణచివేశారని ఆరోపించారు. ఏనాడూ స్వామివారి కైంకర్యాలను సక్రమంగా రమణ దీక్షతులు నిర్వహించే వారు కాదన్నారు. రాజకీయ వేత్తలు, వ్యాపారస్తుల ప్రాపకం కోసం ఆయన వెంపర్లాడేవారన్నారు. శ్రీవారి అర్చకులు ఆలయంలో పూజలు చేయాలే తప్ప మరెక్కడా హోమాలు చేయకూడదని, అయితే రమణ దీక్షితులు అందుకు విరుద్ధంగా గతంలో వైఎస్‌కు, అనంతరం ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావాలని హోమాలు నిర్వహించారన్నారు. రమణ దీక్షితులు చాలా తప్పుడు విధానాలను అవలంబించారని, ఆయనపై మిగిలిన మూడు కుటుంబాలకు చెందిన వారు రాష్ట్రప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు ఫిర్యాదు చేశారని, దీంతో ఆయన ఉద్యోగ విరమణ కాలపరిమితి గతంలోనే ముగిసిందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి తొలగించిందని చెప్పారు. ఈ సమావేశంలో చైతన్య వేదిక నాయకులు వడ్లమూడి రాజా, ములుగు రవికుమార్, కూరపాటి కిషోర్‌శర్మ, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.