ఆంధ్రప్రదేశ్‌

కర్నాటక పరిణామాలతో కమలం డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: దక్షిణాదిలో పాగా వేస్తున్నాం.. ఇక దక్షిణాదిన తమ ఆపరేషన్ ప్రారంభం కాబోతున్నదంటూ కర్నాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే కమలనాథుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నాం.. ఇటీవల మణిపూర్, గోవా, మేఘాలయ రాష్ట్రాల్లో తమకు మెజార్టీ లేకపోయినా అధికారం చేజిక్కించుకున్న విధంగానే కర్నాటకలో కూడా ఏదైనా సాధించగలమన్న ధీమా.. కాంగ్రెస్, జేడీఎస్‌ల గట్టి పట్టుదల ముందు తుస్సుమంది. వాస్తవానికి యడ్యూరప్ప ప్రమాణం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే బల నిరూపణలో బీజేపీ విఫలం కావటం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనుంది. టీడీపీలో ఆనందోత్సాహాలు.. కాంగ్రెస్‌లో విజయోత్సవాలు మిన్నంటుతున్నాయి. టీడీపీలో సాధారణ నేత నుంచి సీఎం చంద్రబాబు వరకు బీజేపీ ఓటమిని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్‌ల విజయాన్ని స్వాగతిస్తూ చేసిన ప్రసంగాలు హోరెత్తాయి. కర్నాటక తెలుగువారు బాబు పిలుపుకు స్పందించబట్టే బీజేపీకి ఆశించిన సీట్లు రాకుండా చేశారని ఇకనైనా మోదీ ఈ రాష్ట్రంపై కక్ష సాధింపు మాని తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని టీడీపీ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆదివారం రాష్టవ్య్రాప్తంగా విజయోత్సవ ర్యాలీలు జరుగనుండగా విజయవాడలో జరిగే ర్యాలీలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్ క్రమేణా పుంజుకుంటున్నదనే భావన వారిలో కన్పిస్తున్నది. ఏది ఏమైనా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతున్నది. ప్రతిపక్ష వైకాపాలో ఒక రకమైన నిర్లిప్తత నెలకొంది. కర్నాటక పరిణామాలపై ఆ పార్టీ నేతలెవరూ స్పందించిన దాఖలాలు లేవు. ఇక కమలనాథులు ఒక్కసారిగా డీలా పడ్డారు. సీనియర్ నేతలు ఫోన్‌లకు కూడా అందుబాటులో లేకుండాపోయారు. కర్నాటకలో ఓటమి పాలైనప్పటికీ బాబుపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతాయనే సంకేతాలు పంపుతున్నారు. ఇక బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో పెరిగిన చంద్రబాబు ఆపై అధికారం కోసం మామను హతమార్చి పసుపురంగు పులుముకున్నప్పటికీ ఆయనలో కాంగ్రెస్ రక్తమే వెయ్యిపాళ్లు ప్రవహిస్తుంటుందని అన్నారు. ఇక కాంగ్రెస్ విజయం పట్ల సంతోషించక ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెకు వ్యతిరేకంగానే టీడీపీ ఆవిర్భవిస్తే నేడు కర్ణాటకలో 36 సీట్లు కల్గిన జేడీఎస్‌తో కల్సి కాంగ్రెస్ అధికారం అందిపుచ్చుకోటం ఆయనకు చంద్రబాబుకు సంతోషంగా మారిందన్నారు. గతంలో సంజీవరెడ్డిని రాష్టప్రతిగా అంతరాత్మ ప్రబోధంతో ఓటమి పాల్జేసినప్పుడు.. ఎమర్జెన్సీ విధించినప్పుడు బాబు కాంగ్రెస్‌లోనే ఉన్నాడని, అలాంటి వ్యక్తికి బీజేపీ ఓటమి సంతోషాన్ని కలుగచేయటంలో ఆశ్చర్యం లేదన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే ఊళ్లోవారి పెళ్లికి కుక్కల హడావుడిలా టీడీపీ వైఖరి ఉందంటూ ఎద్దేవా చేశారు.