ఆంధ్రప్రదేశ్‌

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 19:పర్యావరణ పరిరక్షణకు మనమందరం కలిసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఒంగోలులోని ఎన్‌టిఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్టస్ధ్రాయి అటవీశాఖాధికారుల సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2029నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని 50శాతం పెంచాలన్నదే రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ఆదిశగా ముందుకు వెళ్ళాలని సూచించారు. వనం-మనం కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సక్రమంగా సంరక్షించే బాధ్యత అందరం తీసుకునే విధంగా ప్రతిజ్ఞ చేయాలన్నారు. అటవీశాఖాధికారులు మొక్కల సంరక్షణ, పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో ప్రజలతో ర్యాలీలు, సెమినార్లు, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. అడవుల్లో భూగర్భజలాల పెంపుదల కోసం 500కోట్లరూపాయల అంచనాలతో పనులు చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. నర్సరీల అన్నింటిని వనమిత్రగా మార్పుచేసి అక్కడి ప్రజలకు అన్నిరకాల వసతులు కల్పించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో నగర వనాలు, ఏకో టూరిజం స్పాట్లు, జంతుప్రదర్శన శాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలకు అవసరమైతే టిటిడి నుండి నిధులు అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో పచ్చదనం, ఏకో టూరిజం ప్రాజెక్టులు, సైన్స్ సిటిలు, మ్యూజియంలను అభివృద్ధి చేయాలని అప్పుడే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారులందరు సమష్టిగా బాధ్యతగా పనిచేసి అటవీశాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎర్రచందనం వేలం ద్వారా సుమారు 110కోట్లరూపాయలు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి అటవీశాఖాధికారులు, పోలీసులు సమష్టిగా పనిచేయాలన్నారు. బేస్ క్యాంపుల నిర్వహణకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలకు 50లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
జలసంరక్షణ ఉద్యమం జూన్ నెలాఖరు వరకు నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ అధికారులు తమ సర్కిల్ పరిధిలో చేపడుతున్న కార్యకలపాలపై పవర్‌పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు. అటవీశాఖకు సంబంధించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ముందుగా రాష్టస్ధ్రాయి అధికారుల సదస్సును మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసదస్సులో రాష్ట్రఅటవీశాఖాధిపతి పి మల్లికార్జునరావు, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారు కజూరియా, ఐఎఫ్‌ఎస్ అధికారిణి రేవతి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్‌ఒలు, సోషల్ ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..రాష్టస్ధ్రాయి అటవీశాఖాధికారుల సదస్సులో మాట్లాడుతున్న
రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు