ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 20: రాజకీయ కాంక్షతో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు తిరుమల ప్రతిష్ఠను దిగజారుస్తున్నాడని టీటీడీ పాలక మండలి సభ్యుడు డొక్కా జగన్నాథం విమర్శించారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన రమణ దీక్షితులే రాజకీయ ప్రేరేపితుడై విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చిన ఆయన రమణ దీక్షితులు అవలంభిస్తున్న విధానాలను తప్పుబట్టారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగన్నాథం మాట్లాడుతూ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కనీస వేతన చట్టం ప్రకారం జీతం తీసుకుంటున్న రమణ దీక్షితులుకు 65 సంవత్సరాల వయస్సు దాటడంతో ప్రభుత్వం ఉద్వాసన పలికిందన్నారు. ఈవిషయంలో రమణ దీక్షితులు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రాజకీయ పరమైన ఆరోపణలు చేస్తూ తిరుమల తిరుపతి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రమణ దీక్షితులును ఆలయ ప్రధాన అర్చకుడిగా తొలగించడం ద్వారా బ్రాహ్మణ జాతికి అన్యాయం చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొనడం సిగ్గుచేటన్నారు. బ్రాహ్మణుల గురించి మాట్లాడే కనీస అర్హత లక్ష్మీనారాయణకు లేదన్నారు.
రమణ దీక్షితులు వంశస్తులనే ప్రధాన అర్చకులుగా నియమించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క బ్రాహ్మణుడికి లబ్ధి చేకూర్చని లక్ష్మీనారాయణ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం విడ్డూరమని విమర్శించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ జాతిని ఆదుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడేనన్నారు. బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 300కోట్ల మేర రుణాలు అందచేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని జగన్నాథం స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడు వేమూరి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పీవీ ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.